ఏపీలో మరో 385 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 39,848 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 87 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 4,355 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 39,848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 87 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 46, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 675 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,47,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,355 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,373కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Statistics
Daily
Update

More Telugu News