ఏపీలో కొత్తగా 191 కొవిడ్ పాజిటివ్ కేసులు

AP covid daily bulletin
  • గత 24 గంటల్లో 26,514 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 2,734 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 26,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 191 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 37 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 416 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,418కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,53,134 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,734 మందికి చికిత్స జరుగుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Bulletin
Today Cases

More Telugu News