మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

Markets ends in profits
  • 85 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 45 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6.35 శాతం లాభపడ్డ టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 61,235కి చేరుకుంది. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 18,258 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈనాటి ట్రేడింగ్ లో 1,630 షేర్లు అడ్వాన్స్ కాగా.... 1,609 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 62 షేర్లు ఎలాంటి మార్పుకు గురి కాలేదు.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్(6.35%), సన్ ఫార్మా (3.54%), ఎల్ అండ్ టీ (2.64%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.49%).

టాప్ లూజర్స్:
విప్రో (-5.98%), ఏసియన్ పెయింట్స్ (-2.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.60%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News