ఏపీలో కొత్తగా 434 కరోనా పాజిటివ్ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 15,193 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 108 కొత్త కేసులు
  • చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి
  • ఇంకా 14,726 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటలలో 15,193 శాంపిల్స్ పరీక్షించగా, 434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 62, పశ్చిమ గోదావరి జిల్లాలో 56 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,636 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,83,788 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,726 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,698కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Daily Update
Today Cases

More Telugu News