ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Dreaded accident in mulugu 5 dead
  • మేడారం వెళ్లే భక్తుల వాహనాలతో నిత్యం రద్దీ
  • ఆర్టీసీ బస్సు, కారు ఢీ
  • మృతదేహాలు ములుగు ఆసుపత్రికి తరలింపు
ములుగులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో గత నెల రోజులుగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది.

జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. కానీ, ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Mulugu
Road Accident
Medaram

More Telugu News