ఏపీలో 37 కరోనా కేసుల గుర్తింపు... పూర్తి వివరాలు ఇవిగో!

Corona updates in AP
  • గత 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు
  • అనంతపురం జిల్లాలో 17 కొత్త కేసులు
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 42 మంది
  • ఇంకా 506 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,031 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 506 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.
.
Go Back to Shorts
Corona Virus
Updates
AP
Andhra Pradesh
Today Cases

More Telugu News