పవర్ హౌస్ లాంటి నా బావ తారక్ షో చూస్తే ముచ్చటేసింది: అల్లు అర్జున్

  • అన్న మెగా పవర్ రామ్ చరణ్ గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు
  • రాజమౌళి విజన్ చాలా గొప్పగా ఉంది
  • నిజంగా ఇది KilleRRR అంటూ బన్నీ కామెంట్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అల్లు అర్జున్ స్పందించాడు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడాడు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘మనమంతా గర్వపడే రాజమౌళి విజన్ గొప్పగా ఉంది. నా అన్న మెగా పవర్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు. అందుకు గర్వంగా ఉంది. 

పవర్ హౌస్ లాంటి నా బావ తారక్ షో చూస్తే చాలా ముచ్చటేసింది. అతడంటే నాకు ఎప్పుడూ గౌరవం, ఇష్టమే. అజయ్ దేవగణ్, ఆలియా చాలా బాగా చేశారు. కీరవాణి, సెంథిల్ కుమార్, డీవీవీ దానయ్య.. ఇంకా అందరికీ ప్రత్యేక శుభాభినందనలు. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇది KilleRRR’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

Allu Arjun
RRR
Rajamouli
Ramcharan
Junior NTR

More Telugu News