క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని ప‌క్కా.. మంత్రి బుగ్గ‌న కీల‌క వ్యాఖ్య‌లు

buggana comments on judicial capital
  • జ‌గ‌న్నాథ గ‌ట్టుపై హైకోర్టు భ‌వ‌నం
  • నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీని కూడా నిర్మిస్తాం
  • ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న కీల‌క వ్యాఖ్య‌లు
ఏపీలో పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి శుక్రవారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చి తీరుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనుమ‌తులు రాగానే న‌గ‌రం శివారులోని జ‌గ‌న్నాథ గ‌ట్టుపై హైకోర్టు భ‌వ‌నాన్ని నిర్మించి తీర‌తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

హైకోర్టుతో పాటు ప్ర‌తిష్ఠాత్మ‌క నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీని కూడా జ‌గ‌న్నాథ గ‌ట్టుపై నిర్మించి తీర‌తామ‌ని బుగ్గ‌న వ్యాఖ్యానించారు. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని స్వయంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే బుగ్గ‌న శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
Go Back to Shorts
Kurnool
Judicial Capital
Buggana Rajendranath

More Telugu News