ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో మృతి

Prabhakar Sail NCB witness in Aryan Khan case dies due to heart attack
  • డ్రగ్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్
  • ఈ కేసులో మరో సాక్షి అయిన గోసావికి సెక్యూరిటీగార్డుగా సెయిల్
  • ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవన్న న్యాయవాది
బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ నిన్న మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆయన న్యాయవాది తుషార్ ఖండారే తెలిపారు. మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. 

సెయిల్‌కి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డ్రగ్ క్రూయిజ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కేసులో  మరో సాక్షి అయిన కేపీ గోసావికి సెయిల్ సెక్యూరిటీగార్డుగా ఉన్నారు.
Go Back to Shorts
Aryan Khan
Drugs Case
Shahrukh Khan
Prabhakar Sail
NCB

More Telugu News