చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తీసుకున్నట్టుగా జగన్ తీరు ఉంది: కన్నా లక్ష్మీనారాయణ

  • కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు
  • 7వ సారి కరెంట్ ఛార్జీలను పెంచారు
  • విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం చేస్తామన్న కన్నా 
ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల నేపథ్యంలో అధికార వైసీపీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. 7వ సారి కరెంట్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రతి దాని ధరలు పెంచారని విమర్శించారు. 

చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తీసుకున్నట్టుగా జగన్ తీరు ఉందని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఉన్న ధరల కంటే తక్కువ ధరలను చూపించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 130 సంక్షేమ కార్యక్రమాలను చూపిస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం తొమ్మిదికే పరిమితమయిందని చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Kanna Lakshminarayana
BJP
Jagan
YSRCP

More Telugu News