ఫోన్లు పగలడం తప్పు కాదు దొంగ సాయి... స్కాములు చేయడం, దేశాన్ని దోచుకోవడం తప్పు: బండ్ల గణేశ్ కౌంటర్

Bandla Ganesh counters to Vijayasai Reddy comments
  • విజయసాయి, బండ్ల గణేశ్ మధ్య ట్విట్టర్ వార్
  • తీవ్రస్థాయిలో విమర్శల పర్వం
  • తగ్గేదే లే అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యలు
  • మరోసారి స్పందించిన బండ్ల గణేశ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. గతంలో ఫోన్ పగిలిపోయిందని, చెప్పు తెగేలా కొట్టారని విజయసాయి చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ వెంటనే స్పందించారు. ఫోన్లు పగలడం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం తప్పు కాదు దొంగ సాయి... దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం దొంగ పని సాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. 

"నేను చాలా చిన్నవాడ్ని... నా మీద ఏమున్నా కోర్టు ఊరుకోదు. కానీ జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం, అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు అని గుర్తుపెట్టుకో దొంగ సాయి. అయినా చంద్రబాబు నా బాసా? నాకు నీతి నియమం ఉంది. నేను ఎప్పటికీ తెలుగుదేశానికి చెందినవాడ్ని కాదు. నీకో విషయం తెలియజేయాలి దొంగ సాయి.... నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని. ఆ విషయం వైఎస్సార్ ఆత్మ కేవీపీని అడిగితే తెలుస్తుంది. నేను ఏ పార్టీనో ఆయనే చెబుతారు. 

ఎవడో చెప్పిన మాటల్ని విని ట్వీట్లు చేయకు దొంగ సాయి... నేను చంద్రబాబు మనిషినని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకు. నాకు బతుకునిచ్చింది పవన్ కల్యాణ్... ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటా. నేను తల్లిదండ్రులకు పుట్టా. నీలాగా నీతిలేని బతుకు బతకను. రాజకీయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా నిజాయితీగా ఉంటా, ఒకరినే అభిమానిస్తా, ప్రాణంపోయేదాకా ఒకరితోనే తోడుంటా" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Bandla Ganesh
Vijayasai Reddy
Twitter
War

More Telugu News