ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన ట్విట్టర్ షేర్లు!

Elon Musk holds twitter deal temporarily
  • స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు పెండింగ్ లో ఉన్నాయన్న మస్క్
  • వీటి లెక్క తేల్చాలని వ్యాఖ్య
  • మస్క్ ప్రకటనతో 20 శాతం పతనమైన ట్విట్టర్ షేర్లు
ట్విట్టర్ కు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అందుకే డీల్ ను హోల్డ్ లో పెడుతున్నానని ఆయన తెలిపారు. 

మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోంది. అయితే ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలను అందించాలని మస్క్ డిమాండ్ చేశారు. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్టు చెప్పారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ షేర్ల విలువ ఏకంగా 20 శాతం పడిపోయింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయాలనుకున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Elon Musk
Twitter
Deal

More Telugu News