38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... కోహ్లీ మరోసారి విఫలం

Kohli fails again
  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే
  • టీమిండియా టార్గెట్ 260 రన్స్
  • మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టిన రీస్ టాప్లే
సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో టీమిండియా టాపార్డర్ తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్లు ఇంగ్లండ్ లెఫ్మార్మ్ పేసర్ రీస్ టాప్లే ఖాతాలోకే చేరాయి. తొలుత శిఖర్ ధావన్ (1) అవుట్ కాగా, ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా అదే బాటలో టాప్లేకు వికెట్ అప్పగించాడు. ఫామ్ లో లేక సతమతమవుతున్న కోహ్లీ కాసేపు ప్రతిఘటించినా, ఓ అవుట్ స్వింగర్ కు వికెట్ చేజార్చుకున్నాడు. మరోసారి వికెట్ల వెనుక దొరికిపోయాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు కాగా, క్రీజులో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 38 ఓవర్లలో 208 పరుగులు చేయాలి.
Go Back to Shorts
Team India
Virat Kohli
England
3rd ODI

More Telugu News