రేపు ఏపీలోని 16 జిల్లాల్లో వర్షాలు.. మోస్తరు వానలు పడతాయన్న వాతావరణ శాఖ

Meteorological department predicts moderate rains in several districts of AP tomorrow
  • శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వర్షాలు పడతాయని అంచనా
  • మిగతా చోట్ల స్వల్పంగా కురిసే అవకాశం ఉందని వెల్లడి
  • ట్వీట్ చేసిన ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. మిగతా చోట్ల స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
Go Back to Shorts
Meteorological department
rains
Andhra Pradesh
APSDMA
Rain alert

More Telugu News