నా వెంట పడకు అక్కా.. అంటూ బాలీవుడ్ నటికి రిషబ్ పంత్ కౌంటర్

rishabh pant conters urvashi rautela
  • ‘ఆర్పీ’ తన ఇంటికి వచ్చాడని ఇంటర్వ్యూలో చెప్పిన నటి ఊర్వశీ రౌతేలా
  • ఆర్పీ అంటే రిషబ్ పంతే అని అంటున్న అభిమానులు
  • ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పిన రిషబ్
  • అబద్ధాలకూ హద్దు ఉంటుందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పంత్ పోస్ట్
భారత క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు ప్రేమలో మునిగి తేలినా పెళ్లి వరకూ రాలేదు. ఇంకొందరు తమ బంధం బహిర్గతం కాకుండా చూసుకున్నారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ప్రేమలో పడ్డాడని కొన్నాళ్ల కిందట ప్రచారం జరిగింది. దీన్ని పంత్ ఖండించాడు. తాను ఈషా నేగి అనే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినా ఈ ప్రచారం ఆగలేదు. అదే సమయంలో పంత్ గురించి ఊర్వశీ రౌతేలా తరచూ ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ పేరు నేరుగా ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేసింది. 

‘ఆర్పీ’ తన ఇంటికి వచ్చి లాబీలో గంటలకొద్ది వేచి చూశాడని చెప్పింది. అతడిని కలవాలని అనుకున్నా.. బాగా అలసిపోవడంతో నిద్రపోయానని తెలిసింది. లేచి చూసే సరికి ఆర్పీ నుంచి   16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఆర్పీ ఎవరు అని యాంకర్ ప్రశ్నిస్తే సమాధానం దాట వేసింది. అయితే, ఆర్పీ అంటే రిషబ్పంతే అని అందరూ భావిస్తున్నారు. 

దీనిపై రిషబ్ పంత్ స్పందించాడు. తను కూడా ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చాడు. ‘ వార్తల్లో నిలవడం కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలను చెప్పే వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. పేరు, ప్రఖ్యాతుల కోసం వాళ్లు ఇలా దిగజారడం శోచనీయం. దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలి' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. 'నా వెంట పడకు అక్కా.. అబద్ధాలకు కూడా హద్దులు ఉంటాయి' అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు.
Go Back to Shorts
Team India
rishab pant
urvashi
Bollywood

More Telugu News