గంటకు 180 కిమీ వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించిన వందేభారత్ రైలు... వీడియో ఇదిగో!

Vande Bharat Express records 180 KMPH top speed in trial run
  • భారత్ లో హైస్పీడ్ ట్రాక్ ల ఏర్పాటు
  • కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ట్రయల్ రన్
  • నిలకడగా 180 కిమీ వేగంతో ప్రయాణించిన వందేభారత్
  • వీడియో పంచుకున్న రైల్వేశాఖ మంత్రి
భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ టెస్టులో వందేభారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం. భారత్ లో ఇంత వేగంతో దూసుకెళ్లిన రైలు ఇప్పటివరకు లేదు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. 

గంటకు 180 కిమీ వేగంతో వెళుతున్నా రైలు బోగీ అద్దం నిలకడగా ఉందని, ఆ వేగానికి ఎక్కడా అదిరిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నీళ్లతో ఉన్న గ్లాసు కూడా కనిపిస్తోంది. అందులోని నీరు ఎక్కడా తొణకకపోవడం వందేభారత్ రైలు బోగీల పటిష్ఠతను చాటుతోంది.
Go Back to Shorts
Vande Bharat Express
Top Speed
Trial Run
Aswini Vaishnav
India

More Telugu News