ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలి అనేది గంజాయిపాత్రుడి కోరిక: విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

Vijaysai Reddy comments in Twitter
  • టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు
  • గంజాయిపాత్రుడు, బోండం అంటూ వ్యాఖ్యలు
  • 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ విమర్శలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరగుండు, గంజాయిపాత్రుడు, బోండం అంటూ సెటైర్లు వేశారు. 

బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి, వైజాగ్ రాజధాని కాకుండా ఉంటే అక్కడి ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరికీ తెలియదు, ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలి అనేవి గంజాయిపాత్రుడి కోరికలని విజయసాయి వివరించారు. 

ఇక, బోండం ఒరిజినల్ వ్యాపారం చిత్తు కాగితాలు ఏరుకోవడం అని, దుర్గగుడి వద్ద సైకిలు బెల్లులు కొట్టేసి, ఆ డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేస్తుంటాడని వివరించారు. గంజాయిపాత్రుడు, బోండం, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి తుక్కును పెంచి పోషించిన దుర్మార్గం 40 ఏళ్ల ఇండస్ట్రీదేనని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Twitter
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News