నా సగ భాగం నన్ను విడిచినట్టు అనిపిస్తోందంటూ మహేశ్​ భార్య నమ్రత ఎమోషనల్​ పోస్ట్

 It is almost like a part of me has left says namrata
  • తొలిసారి సొంతంగా విదేశీ యాత్రకు వెళ్తున్న మహేశ్ కుమారుడు గౌతమ్
  • ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన నమ్రత
  • తను తిరిగి వచ్చేంతవరకు దిగులుగానే ఉంటుందని వ్యాఖ్య
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో కలిసి తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఏడాదికి నాలుగైదుసార్లు విహార యాత్రలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ తల్లిదండ్రులతో కలిసి ఇలా యాత్రలకు వెళ్లే  గౌతమ్ తొలిసారి వారు లేకుండా విదేశాలకు వెళ్తున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపిన నమ్రత అతని గురించి భావోద్వేగ పోస్ట్ చేశారు. పాఠశాల కల్చరల్ ట్రిప్ లో భాగంగా విదేశాలకు వెళ్తున్న అతను తిరిగొచ్చేంత వరకూ తనకు వెలితిగానే ఉంటుందని తెలిపారు. గౌతమ్ తన స్నేహితులతో ఎయిర్ పోర్టులో, విమానంలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. 

‘కల్చరల్ టూర్ లో భాగంగా మొదటిసారి తను సొంతంగా విదేశాలకు బయలుదేరాడు. దాంతో, నా సగ భాగం నన్ను విడిచిపెట్టినట్టు అనిపిస్తోంది. ఒక రోజంతా శూన్యంగా అనిపించింది. ఇప్పుడే సాధారణ స్థితిలోకి వస్తున్నా. తను తిరిగొచ్చి, మా కళ్ల ముందు కనిపించేంత వరకూ మాకు వెలితిగానే ఉంటుంది. ఏదేమైనా మా చిన్నారి బాబు గూడును వదిలి ఎగిరివెళ్లిపోయాడు. ఈ వారం రోజులు తను వినోదం, ఆనందం, సాహసం, అన్నింటికీ మించి తనను తాను కనుగొనాలని కోరుకుంటున్నాను. ఈ యాత్ర పూర్తిగా విలువైనదని ఆశిస్తున్నా నా బేబీ. నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటాను’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Mahesh Babu
namrata
gautam
Social Media

More Telugu News