డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎంపీ అరవింద్ ట్వీట్

  • డీఎస్ ఆరోగ్యం విషమంగా ఉందని ఎంపీ అరవింద్ ప్రకటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడి
  • డీఎస్‌కు ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ అస్వస్థతకు లోనైన నేపథ్యంలో ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నేడు రేపూ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా.. డి.శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు ఆయనను సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన డీఎస్ ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత డీఎస్‌ను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. 



D.Srinivas

More Telugu News