అడగ్గానే నిధులు ఇచ్చారు.. గుడివాడ బస్టాండ్‌కు జగన్ పేరే పెడతాం: కొడాలి నాని

Will Name After Jagan to Gudivada bus stand says Kodali Nani
  • గుడివాడలో ఆర్టీసీ డిపో ప్రారంభం
  • వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకున్నా తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కొడాలి నాని
  • ఈ నెల 19న జగన్ చేతుల మీదుగా గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
కృష్ణా జిల్లా గుడివాడ బస్టాండ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెడతామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బస్టాండ్ అభివృద్ధికి అడగ్గానే జగన్ నిధులు మంజూరు చేశారని, కాబట్టి దానికి ఆయన పేరే పెడతామని స్పష్టం చేశారు. గుడివాడలో నిన్న ఆర్టీసీ డిపోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మే 19న జగన్ చేతుల మీదుగా గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

చంద్రబాబును పొగిడితే నన్నేమైనా ఏకగ్రీవంగా గెలిపిస్తాడా? అని నాని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో మంత్రిగా పనిచేసినవారు, నాలుగుసార్లు గెలిచిన వారు మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని చెబుతున్నారని అన్నారు. అయితే, గెలిచినా, గెలవకపోయినా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతే చాలని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Gudivada
Kodali Nani
YSRCP

More Telugu News