'మోసగాళ్లకు మోసగాడు' బడ్జెట్ ఎంతంటే! .. నిర్మాత ఆదిశేషగిరిరావు

Adiseshagiri Rao Interview
  • 1971లో వచ్చిన 'మోసగాళ్లకు మోసగాడు'
  • అప్పట్లో సంచలన విజయం సాధించిన సినిమా
  • కౌబోయ్ సినిమాలకు తెరతీసిన యాక్షన్ మూవీ  
  • కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న రీ రిలీజ్
కృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'మోసగాళ్లకు మోసగాడు' ఒకటి. ఈ సినిమాతోనే ఆయన సాహసాలకు .. ప్రయోగాలకు తెరలేచిందని చెప్పుకోవాలి. 1971లో విడుదలైన ఈ సినిమా, తెలుగులో ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈ నెల 31వ తేదీన కృష్ణ జయంతి రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు ఎన్టీవీ ఎంటర్టయిన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.  "అన్నయ్య జయంతి రోజున 'అల్లూరి సీతారామరాజు' గానీ 'సింహాసనం' గాని రీ రిలీజ్ చేద్దమని అనుకున్నాము. కానీ అభిమానులంతా కూడా 'మోసగాళ్లకు మోసగాడు' అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు" అన్నారు. 

"అప్పట్లో అన్నయ్య చేసే ఒక్కో ఫ్యామిలీ సినిమాకి 5 లక్షలు ఖర్చు అయ్యేది. కానీ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాకి మాత్రం 7 లక్షలు ఖర్చు  అయింది. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలంటే, కొత్త టెక్నాలజీ సాయం తీసుకోవాలి. అందుకు 20 లక్షల వరకూ ఖర్చు అయింది" అంటూ చెప్పుకొచ్చారు. 

Go Back to Shorts
Krishna
Adiseshagiri Rao
Mosagallaku Mosagadu

More Telugu News