వందలాది మొసళ్ల మధ్య బోటు ప్రయాణం.. వీడియో

Boat passes through a sea of reptiles Watch terrifying video
  • చెరువు నిండా మొసళ్లే
  • వాటి మధ్య నుంచి దూసుకుపోయిన పడవ
  • లక్షల డాలర్లు ఇచ్చినా ఆ సాహసం వద్దంటున్న నెటిజన్లు
అదొక పెద్ద చెరువు. అందులో వందలాది మొసళ్లు. వాటి మధ్య ఓ బోటు వేగంగా ప్రయాణిస్తోంది. మొసళ్లను తొక్కుకుంటూ, తోసుకుంటూ ఆ బోటు ముందుకు సాగిపోతున్న వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఊడ్లి టెరిఫైయింగ్ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించి వీడియోని షేర్ చేశారు. 

ఓ వ్యక్తి బోటుతో చెరువులోకి రాగా, అక్కడ భారీ సంఖ్యలో మొసళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసి బోట్ లోని వ్యక్తి ఏ మాత్రం భయపడిపోకుండా ముందుకే నడిపించాడు. ఆ బోటు రావడాన్ని చూసి మొసళ్లు దాడి చేయలేదు. బదులుగా అవి భయంతో అటూ, ఇటూ పరుగులు తీశాయి. రెండు రోజుల్లోనే ఈ వీడియోని 26 లక్షల మంది చూసేశారు. ఎంతో మంది లైక్ చేస్తూ, కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ యూజర్ తనకు మిలియన్ డాలర్లు ఇచ్చి వీటి మధ్య రైడ్ చేయాలని కోరినా చేయనని తేల్చి చెప్పాడు. ఇలా చాలా మంది నో అనే చెప్పడం గమనార్హం.
Go Back to Shorts
reptiles
lake
boat
terrifying
viral vedio

More Telugu News