ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్ చేసిన ఖుష్బూ

On the road to recovery says Khusbu through twitter
  • టెయిల్ బోన్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడి
  • ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన నటి
  • త్వరలోనే పూర్తిగా నయమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్న ఖుష్బూ
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఆసుపత్రిలో చేరారు. టెయిల్ బోన్ చికిత్స పొందుతున్నట్లు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. అందులో ఆసుపత్రి బెడ్ పైన పడుకొని ఉన్నారు. కొక్కిక్స్ బోన్ ట్రీట్మెంట్ కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే పూర్తిగా నయమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Khushbu

More Telugu News