ఆరు నెలలు కష్టంగా గడిచాయంటూ సమంత పోస్ట్​ వైరల్‌

  • కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత
  • నటనకు ఏడాది విరామం తీసుకుంటున్నట్టు వార్తలు
  • వాటిని నిజం చేసేలా ఇన్‌ స్టాలో పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె ఏడాదిపాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేసేలా ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. అసలు సమంత ఆ పోస్ట్‌ పెట్టడానికి కారణమేంటి అని నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. కారవాన్‌ ఫొటో పెట్టిన సమంత ‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’ అని రాసింది. మరో పోస్ట్‌లో ‘ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొంది. 

దీంతో అనారోగ్యంతో బాధపడుతూనే సమంత ఎంతో కష్టంగా షూటింగ్స్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గతేడాది తాను మయోసైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్టు సమంత స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సమంత ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. తెలుగులో విజయ్ దేరకొండ సరసన ‘ఖుషి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. సెప్టెంబరు 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Samantha
acting
Social Media

More Telugu News