అస్వస్థతకు గురైన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

  • చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు
  • టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు
  • పాలకొల్లులో నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత
  • తోపులాటలో కిందపడిపోయిన నిమ్మల
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటివద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోవడంలేదంటూ వారు మండిపడ్డారు. ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే అందుకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.

Nimmala Rama Naidu
TDP MLA
Palakollu
Chandrababu
Arrest
Telugudesam
Andhra Pradesh

More Telugu News