భారత టెక్కీలకు వేతన పెంపు, పదోన్నతులకు యాక్సెంచర్ బ్రేక్

Accenture Holds Back Salary Hikes For India Employees Citing Macro Pains
  • ఈ ఏడాది వేతన పెంపు, బోనస్ చెల్లింపులు ఉండవన్న యాక్సెంచర్
  • కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని వెల్లడి
  • శ్రీలంకలోని ఉద్యోగులకూ వర్తిస్తుందన్న యాక్సెంచర్
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. భారత్‌లోని తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు, బోనస్ చెల్లింపులు ఉండవని తెలిపింది. భారత్‌తో పాటు శ్రీలంకలోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని వెల్లడించింది. ఈ మేరకు యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు సమాచారం చేరవేశారు. ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో యాక్సెంచర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

యాక్సెంచర్ వృద్ధి అంచనాలకు అనుగుణంగా లేకపోవడం నిరాశకు గురి చేసింది. 2023 మార్చిలో పందొమ్మిదివేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నైపుణ్యాలు, పని ప్ర‌దేశం ఆధారంగా వేత‌నం అందించేలా యాక్సెంచ‌ర్ వేత‌న చెల్లింపులు ఉంటాయ‌ని, ఈ ఏడాది ఉద్యోగుల‌కు వేత‌న పెంపును కంపెనీ చేప‌ట్ట‌డం లేద‌ని ఉద్యోగుల‌కు పంపిన ఈ మెయిల్‌లో కంపెనీ ఎండీ అజ‌య్ విజ్ పేర్కొన్నారు. మరోవైపు, పదోన్నతులను కూడా కంపెనీ కుదిస్తోంది. ఒకటి నుంచి నాలుగు లెవల్స్ వరకు పదోన్నతులను 2024 జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Go Back to Shorts
Accenture
it employees

More Telugu News