ప్రవళిక ఆత్మహత్య: ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy on Pravalika suicide
  • ప్రవళికది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణ
  • ఏ ఒక్క వర్గానికీ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శ
  • తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఏ ఒక్క వర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట యమదూతగా మారిందన్నారు. కాగా, మూడు రోజుల క్రితం ప్రవళిక ఆత్మహత్య తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
G. Kishan Reddy
BJP

More Telugu News