ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటారు: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ లాంచ్!

Sarvam Shakthimayam Web Series
  • భక్తిరస ప్రధానమైన 'సర్వం శక్తిమయం'
  • అష్టాదశ శక్తిపీఠాల చుట్టూ తిరిగే కథ
  • ప్రియమణి ప్రధానమైన పాత్రగా సాగే సిరీస్ 
  • ఈ నెల 20వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
ఇంతవరకూ భక్తిరస ప్రధానమైన సినిమాలు .. సీరియల్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ ను అందించడానికి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రెడీ అవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 20వ తేదీ నుంచి 'సర్వం శక్తిమయం' అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ను అందించనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.  

పండుగ సందర్భానికి తగినట్టుగానే, 18 శక్తి పీఠాల చుట్టూ తిరిగే కథ ఇది. 10 ఎపిసోడ్స్ గా రూపొందించిన ఈ సిరీస్, అష్టాదశ శక్తి పీఠాలను పరిచయం చేస్తూ ముందుకు వెళుతుంది. ఒక కుటుంబం శక్తి పీఠాలను చూడటానికి బయల్దేరడం. ఆ శక్తి పీఠాలపై పరిశోధన చేసే ప్రధానమైన పాత్ర వాళ్లకి పరిచయం కావడంతో అసలు కథ మొదలవుతుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడటానికి కారణం .. శక్తి పీఠాల వైభవం ... ఆదిశంకరులవారి ప్రస్తావన .. శక్తిపీఠాలతో ముడిపడిన లీలా విశేషాలను ఆవిష్కరించడం ఈ సిరీస్ ప్రధానమైన ఉద్దేశం. ప్రియమణి .. సంజయ్ సూరి .. సుబ్బరాజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను, అంకిత్ - విజయ్ నిర్మించగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Priyamani
Subbaraju
Sanjay Soori

More Telugu News