రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దసరా శుభాకాంక్షలు

AP CM Jagan dasara greetings to people
  • ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించిన జగన్
  • దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అన్న జగన్
  • దుర్గామాత ఆశీస్సులు.. దీవెనలు ప్రజలపై ఉండాలన్న జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు.

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు... దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
Go Back to Shorts
YS Jagan
Andhra Pradesh
dasara

More Telugu News