లంగా ఓణీలో జాన్వీ పల్లెటూరి సోయగం... 'దేవర' నుంచి లేటెస్ట్ స్టిల్ విడుదల

Devara unit releases Janhvi Kapoor half saree still
  • ఎన్టీఆర్, కొరటాల కలయికలో దేవర
  • గోవాలో తాజా షెడ్యూల్
  • జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • "ఇదిగో మా తంగం" అంటూ జాన్వీ స్టిల్ పంచుకున్న దేవర యూనిట్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. తాజాగా, జాన్వీ కపూర్ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా కనిపిస్తున్న లేటెస్ట్ స్టిల్ ను దేవర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. లేలేత పరువాల జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 

ఈ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. "ఇదిగో మా తంగం" అంటూ చిత్రబృందం పేర్కొంది. దేవర చిత్రం తాజాగా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ కోసం ఇటీవల గోవా వెళ్లాడు. 

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Go Back to Shorts
Janhvi Kapoor
Devara
NTR
Koratala Siva

More Telugu News