మూడు రోజులపాటు పవన్ కాకినాడలో మకాం.. సమీక్ష!

Pawan Kalyan Kakinada Tour
  • 28 నుంచి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష
  • నేటి సాయంత్రం ఖరారు కానున్న టూర్ షెడ్యూల్
  • సమీక్ష తర్వాత జనసేన పోటీపై స్పష్టత
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. జనసేన లోకల్ లీడర్లతో పాటు కార్యకర్తలను కలుసుకుంటారని సమాచారం. అయితే, ఈ టూర్ షెడ్యూల్ ను జనసేన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మంగళవారం సాయంత్రానికి షెడ్యూల్ పై స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జనసేనాని సమీక్ష తర్వాత కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాలలో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయనుందనే విషయంపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 28, 29, 30 తేదీలలో పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటిస్తారు. ఆయన పర్యటనపై జనసేన వర్గాలతో పాటు మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Kakinada
PK Tour
Kakinad Janasena

More Telugu News