మేం వదిలేసిన పీకేను వాళ్లు పట్టుకున్నారు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందన్న పెద్దిరెడ్డి
  • ప్రశాంత్ కిశోర్ కూడా చేసేదేమీ లేదని ఎద్దేవా
  • గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా
టీడీపీ అధినేత చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ... చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిశోర్ ను తాము వదిలేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు పట్టుకున్నారని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... ప్రశాంత్ కిశోర్ కూడా చేసేదేమీ లేదని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎల్లో మీడియా అండగా ఉందని విమర్శించారు. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Prashant Kishor
Telugudesam

More Telugu News