విశాఖలో కమ్మేసిన పొగమంచు.. దారి కనిపించక ఐదు వాహనాల ఢీ

5 Vehicles collide in Visakhapatnam Kommadi Junction
  • కొమ్మాది క్రాస్‌రోడ్డులో ఘటన
  • ఢీకొన్న ప్రైవేటు బస్సు, మూడు కార్లు, ట్యాంకర్
  • ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్
పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది జంక్షన్‌లో ఈ ఉదయం జరిగిందీ ఘటన.

ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రైవేటు బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Go Back to Shorts
Visakhapatnam
Kommadi Junction
Road Accident

More Telugu News