'కల్కి' చిత్రంలో ప్రభాస్ కోసం కొత్త రకం తుపాకులు... వీడియో ఇదిగో!

Proto type guns for Prabhas in Kalki 2898 AD movie
  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ'
  • తొలిసారి సైన్స్ ఫిక్షన్ జానర్ లో నటిస్తున్న ప్రభాస్
  • వినూత్న తరహా తుపాకుల డిజైనింగ్ కోసం స్పెషల్ గా వర్క్ షాప్
  • వీడియో పంచుకున్న వైజయంతీ మూవీస్
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' చిత్రంపై అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ జానర్ లో ప్రభాస్ నటించడం ఇదే మొదటిసారి కావడమే అందుకు కారణం. 

తాజాగా, ఈ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆసక్తికర వీడియోతో అభిమానుల ముందుకొచ్చింది. కల్కి చిత్రంలో ప్రభాస్ ఉపయోగించే తుపాకులకు సంబంధించి వర్క్ షాప్ వివరాలను ఈ వీడియోలో చూపించారు. తుపాకీ ఎలా ఉంటుందో అందిరికీ తెలిసిందే. 

కానీ, 'కల్కి...' చిత్రంలో తుపాకులు చూస్తే కచ్చితంగా విస్మయానికి గురవుతారు. తుపాకీ అంటే ఇలానే ఉండాలన్న రూలేం లేదు అని చిత్రబృందం కొత్త రకం తుపాకులను పరిచయం చేసింది. 'కల్కి...' వర్క్ షాప్ చూస్తే, సినిమా కోసం తుపాకులు డిజైన్ చేస్తున్నారా, లేక ఏలియన్స్ పై యుద్ధం చేయడానికా...? అనే సందేహం వచ్చేలా ఉంది. 

మొత్తమ్మీద దర్శకుడు నాగ్ అశ్విన్ టాలీవుడ్ కు సైంటిఫిక్ గన్స్ ను పరిచయం చేస్తున్నాడనే చెప్పాలి. మరి ఈ తుపాకుల పనితనం ఎలా ఉంటుందో సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు.
Go Back to Shorts
Prabhas
Guns
Kalki 2898 AD
Nag Ashwin
Tollywood

More Telugu News