నా గౌరవాన్ని నిలబెట్టిన టీడీపీకి రుణపడి ఉంటా: తుమ్మల నాగేశ్వరరావు

  • ఖమ్మంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లిన తుమ్మల
  • ఎన్టీఆర్ ఆశయాల కోసం పని చేస్తానని వ్యాఖ్య
  • ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతుగా నిలిచిందన్న తుమ్మల
దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లో ఎదిగానని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా... ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పని చేస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతుగా నిలిచిందని... వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 

తెలుగువారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని తుమ్మల నాగేశ్వరరావు కితాబునిచ్చారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ రూపకల్పన చేశారని... సంక్షేమాల అమలులో దేశానికి మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. ఖమ్మంలో టీడీపీ జిల్లా కార్యాలయం స్థలాన్ని రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన గౌరవాన్ని నిలబెట్టిన టీడీపీకి రుణపడి ఉంటానని తుమ్మల అన్నారు. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి తుమ్మల వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Thummala
Congress
Telugudesam
NTR

More Telugu News