కనిగిరిలో 'రా కదలిరా' సభ... ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిన చంద్రబాబు

Chandrababu leaves for Kanigiri in helicopter
  • నేటి నుంచి ఈ నెల 29 వరకు 'రా కదలిరా' సభలు
  • రాష్ట్రవ్యాప్తంగా 22 సభలు
  • ఇవాళ కనిగిరిలో తొలి సభ
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే 'రా కదలిరా' పేరిట కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు వివిధ ప్రాంతాల్లో 22 సభలు నిర్వహించనున్నారు. ఇవాళ కనిగిరిలో తొలి సభ జరగనుంది. ఈ సభ కోసం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో పయనమయ్యారు. ఈ హెలికాప్టర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరింది. 

కాగా, కనిగిరి సభ కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. పొత్తు నేపథ్యంలో ఈ సభకు జనసేన శ్రేణులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 'రా కదలిరా' సభల్లో కొన్నింటికి చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.
Go Back to Shorts
Chandrababu
Kanigiri
Raa Kadali Raa
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News