తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న సెలవు ప్రకటించాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

  • జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ
  • ఆ రోజున కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిందన్న ఎన్వీఎస్ఎస్
  • అయోధ్య అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శలు
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తెలంగాణ తరఫున అయోధ్యకు కానుకలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్య అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఇతర పార్టీలకు హితవు పలికారు. భారత జాతికి విపక్షాలు క్షమాపణ చెప్పాలని అన్నారు.

NVSS Prabhakar
Ayodhya Ram Mandir
Holiday
Telangana
BJP
Congress

More Telugu News