నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

Nandamuri Mokshagna to debut in Tollywood soon
  • యాక్టింగ్, డ్యాన్స్ విషయాల్లో ట్రైనింగ్ పొందుతున్న మోక్షజ్ఞ
  • వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ
  • 'అఖండ 2'లో మోక్షజ్ఞ కనిపించే అవకాశం
నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్ విషయాల్లో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నారు. గత నవంబర్ నుంచి శిక్షణ కొనసాగుతున్నట్టు సమాచారం. మెగా హీరోలకు, ప్రభాస్ కు, పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు సత్యానంద్ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో మందికి ఆయన నటనలో శిక్షణ ఇచ్చారు. 

2017లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించారు. 'ఆదిత్య 369' సీక్వెల్ తో ఆయన అరంగేట్రం ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలి సినిమా రావచ్చనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరి దర్శకత్వంలో ఉండొచ్చనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. బాలయ్యతో 'అఖండ 2'కు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ కోసం ఓ ప్రత్యేక పాత్రను ఆయన రెడీ చేసినట్టు చెపుతున్నారు. ఇది ఎంత వరకు వాస్తవమో అధికారికంగా తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Nandamuri Mokshagna
Tollywood
Entry
Acting
Training
Satyanand Acting Institute
Movie News

More Telugu News