టీడీపీ నేత మాగంటి బాబు నివాసానికి వెళ్లిన ముద్రగడ పద్మనాభం

  • ముద్రగడను టీడీపీ లేదా జనసేనలో చేరాలని చెప్పానన్న మాగంటి బాబు
  • పవన్ కల్యాణ్ ను కలుస్తున్నానని చెప్పారని వెల్లడి
  • వైసీపీ మోసం చేసిందని చెప్పారన్న మాగంటి బాబు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడం పద్మనాభం వెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. వీరి సమావేశంపై ఏలూరులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఈ సమావేశం గురించి మాగంటి బాబు మట్లాడుతూ... ముద్రగడ పద్మనాభం తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. తాము కాంగ్రెస్ లో పని చేశామని, ఆ తర్వాత టీడీపీలో ఉన్నామని, పదవులు అనుభవించామని చెప్పారు. టీడీపీలోకి వచ్చినా పర్వాలేదు, టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి జనసేనలో చేరినా పర్వాలేదని ముద్రగడకు తాను చెప్పానని... పవన్ కల్యాణ్ ని కలుస్తున్నానని, జనసేనలో చేరుతానని ఆయన తనకు చెప్పారని తెలిపారు. 

టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే తామంతా కలిసి పని చేస్తామని మాగంటి బాబు చెప్పారు. వైసీపీ తనను మోసం చేసిందని... రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని అన్నారని... వందల కోట్లు మనలాంటి వాళ్ల దగ్గర ఎక్కడుంటాయని ముద్రగడ చెప్పారని అన్నారు. వైసీపీలోకి వెళ్తే అమ్ముడుపోయానని అంటారని... ఇప్పటికే తనకొక గాయం తగిలిందని, ఆ గాయం మానేంత వరకు జనసేనలో ఉంటానని చెప్పారని తెలిపారు.

Mudragada Padmanabham
Maganti Babu

More Telugu News