కుప్పం నుంచి చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా...?: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari makes fun in Kuppam meeting
  • కుప్పంలో నిజం గెలవాలి యాత్ర
  • ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి
  • నాకు మద్దతిస్తారా? లేక, చంద్రబాబుకు మద్దతిస్తారా? అంటూ సభికులకు సరదా ప్రశ్న 
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కుప్పంలో నాకు మద్దతిస్తారా...? చంద్రబాబు గారికి మద్దతిస్తారా...? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా...? అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.

 అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు . ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని... రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. 

ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు... అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Chandrababu
Kuppam
TDP

More Telugu News