ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా: రఘురామకృష్ణరాజు

  • గత ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్ సభ సభ్యుడిగా విజయం
  • కొన్నాళ్లుగా వైసీపీ నాయకత్వానికి శత్రువులా మారిన రఘురామ
  • ఇటీవల వైసీపీకి రాజీనామా
  • నేడు పాలకొల్లు సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానంటూ ట్వీట్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం మరో మలుపు తిరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా గెలిచిన రఘురామ... కొన్నిరోజులకే వైసీపీ నాయకత్వానికి శత్రువులా మారిపోయారు. 

ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘురామ... తాను ఎంతగానో అభిమానించే చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీలో చేరుతున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

"మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు... ఈ రోజు సాయంత్రం పాలకొల్లులో జరగనున్న ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నాను. ప్రజలందరూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలిపి ఘనవిజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అంటూ రఘురామ ట్వీట్ చేశారు.

Raghu Rama Krishna Raju
TDP
Chandrababu
Palakollu
Praja Galam
YSRCP

More Telugu News