'మా' అధ్యక్షుడిగా మరికొంతకాలం మంచు విష్ణు... అదే కార్యవర్గం కొనసాగింపు

  • 2021లో మా ఎన్నికలు
  • మా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు 
  • నిన్న హైదరాబాదు లో మా జనరల్ బాడీ మీటింగ్
  • మంచు విష్ణు నాయకత్వం కొనసాగింపు ప్రతిపాదనకు సభ్యుల ఆమోదం 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ మీటింగ్‌లో అనేక విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ‘మా’ బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మంచు విష్ణు కార్యవర్గం మరికొంతకాలం కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. 

సుమారు 400 మంది 'మా' సభ్యులు హాజరైన ఈ సమావేశంలో... మేలో జరగబోయే ఎన్నికలు, జులైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ‘మా’ భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు మంచు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. 

తమపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచిన సభ్యులందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్యానెల్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తనకు, తన ప్యానెల్‌కు అప్పగించిన బాధ్యతను గుర్తించి ‘మా’ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు.

Manchu Vishnu
MAA
Hyderabad
Tollywood

More Telugu News