రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేయ‌డం ఎందుకు?: కేటీఆర్

BRS Working President KTR Criticizes CM Revanth Reddy
  • హామీల‌ అమలు విషయంలో రేవంత్ రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడ‌న్న కేటీఆర్ 
  • దేవుళ్లు అడ‌గ‌రు కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడంటూ ఫైర్‌
  • పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తాడ‌ని జోస్యం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తా అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయ‌డం ఎందుకు? త‌న భార్య, పిల్ల‌ల మీద ఒట్టు వేయ‌డం లేదని మండిప‌డ్డారు. ఎందుకంటే దేవుళ్లు అడ‌గ‌రని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తాడ‌న్నారు. క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
Go Back to Shorts
KTR
Revanth Reddy
BRS
Congress
Telangana

More Telugu News