దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ కుమార్తె

Sukumar daughter wins Dada Saheb Falke Award
  • 'గాంధీతాత చెట్టు' సినిమాలో నటించిన సుకృతి
  • దాదా సాహెబ్ ఫాల్కే ఉత్తమ బాలనటి అవార్డును కైవసం చేసుకున్న సుకృతి
  • 8వ తరగతి చదువుతున్న సుకుమార్ కూతురు
టాలీవుడ్ లో అగ్రదర్శకుల్లో ఒకరైన సుకుమార్ కూతురు సుకృతి వేణి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సాధించింది. ఉత్తమ బాలనటిగా ఈ ఘనతను సాధించింది. 'గాంధీతాత చెట్టు' చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఉత్తమ బాలనటి అవార్డును అందజేశారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సుకృతికి అవార్డును అందజేశారు. 

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో సుకృతి 8వ తరగతి చదువుతోంది. సుకృతి నటించిన ఈ చిత్రం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి పలు అవార్డులు వచ్చాయి. ఉత్తమ తొలి సినిమా బాలనటిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను సుకృతి గెలుచుకుంది.
Go Back to Shorts
Sukumar
Daughter
Dada Saheb Falke Award

More Telugu News