కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం

  • బండి సంజయ్ తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
  • మొదటిసారి మోదీ కేబినెట్లో చోటు
  • హిందీలో ప్రమాణం చేసిన బండి సంజయ్
కేంద్రమంత్రిగా కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కరీంనగర్ నుంచి ఆయన వరుసగా రెండోసారి గెలుపొందారు. 2019లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌పై 89వేల మెజార్టీతో గెలిచిన సంజయ్... ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుపై 2.25 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఆయనకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కింది. బండి సంజయ్ హిందీలో ప్రమాణం చేశారు.

Bandi Sanjay
BJP
Narendra Modi
Telangana

More Telugu News