పారిస్ లో నడిరోడ్డు మీద కూలిన విమానం.. ముగ్గురి మృతి.. వీడియో ఇదిగో!

Several killed as plane crashes on highway after hitting electric power cable
  • ఎయిర్ ఆంబులెన్స్ తెప్పించి క్షతగాత్రులను తరలించిన రెస్క్యూ టీమ్
  • విద్యుత్ తీగను తాకడంతో విమాన ప్రమాదం
  • ఏ4 మోటార్ వే పై భారీగా నిలిచిన వాహనాలు
పారిస్ లో చిన్న విమానం ఒకటి నడి రోడ్డుపై కుప్పకూలింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
Go Back to Shorts
Plane Crash
Paris
Highway
Electric Cable
Viral Videos

More Telugu News