జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం: రేవంత్ రెడ్డి హామీ

  • నిరుద్యోగ యువత నిరసనలపై స్పందించిన ముఖ్యమంత్రి
  • పార్టీకి చెందిన విద్యార్థి, యువత, నేతలు, అధికారులతో చర్చలు
  • ఉద్యోగ భర్తీకి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడి
జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత నిరసనలపై ఆయన శుక్రవారం స్పందించారు. వారి ఆందోళనలు, డిమాండ్లపై చర్చించారు. పార్టీకి చెందిన విద్యార్థి, యువజన, నేతలు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Revanth Reddy
Congress
Jobs

More Telugu News