హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. భారీ భవనం ఎలా కొట్టుకుపోయిందో చూడండి!

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు చనిపోగా, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్‌ఖాద్‌లోని హైడ్రోపవర్ ప్రాజెక్టు సమీపంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. మరోవైపు, అకస్మాత్తు వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఈ ఉదయం పార్వతి నది సమీపంలోని భవనం కొట్టుకుపోయింది. వరదల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

Cloud Burst
Himachal Pradesh
Heavy Rains
National News

More Telugu News