గొప్ప దాత చిరంజీవిని అన్నయ్యగా ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

  • చిరంజీవి బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
  • తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని వ్యాఖ్య
  • కావాల్సిన వారి కోసం తగ్గే గుణం ఆయనదని ప్రశంస
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానంతో కూడిన ట్వీట్ చేశారు. తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడాన్ని తాను చూశానని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. అన్నయ్య చేసిన సాయాలు కొన్ని మీడియా ద్వారా బయటకు తెలిస్తే... మరెన్నో సాయాలు బయటకు తెలియకుండా గుప్తంగా మిగిలిపోయాయని తెలిపారు.  

కావాల్సిన వారి కోసం ఎంతకైనా తగ్గే గుణం చిరంజీవిగారిదని... ఆ గుణమే ఆయనను సంపన్నుడిగా చేసిందేమో అని పవన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో జనసేనకు రూ. 5 కోట్ల విరాళాన్ని అందజేసి విజయాన్ని అందుకోవాలని తమ ఇలవేల్పు ఆంజనేయుడి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారని తెలిపారు. ఆరోజు ఆయన ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయని చెప్పారు. అలాంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తల్లిలాంటి తమ వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు.

Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News