కాన్పూర్ టెస్టుకు వాన పోటు... రెండో రోజు ఆట వర్షార్పణం

  • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు
  • కాన్పూర్ లో ఎడతెరిపిలేని వాన
  • చిత్తడిగా మారిన మైదానం
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టుపై వరుణుడు పంజా విసిరాడు. తొలి రోజు ఆట వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోగా... రెండో రోజు ఆట పూర్తిగా వర్షార్పణం అయింది. కాన్పూర్ లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో, గ్రీన్ పార్క్ స్టేడియం చిత్తడిగా మారింది. దాంతో, ఇవాళ ఆటను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. 

కాగా, ఈ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ వర్షంతో నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఇవాళ ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది.

Rain
Kanpur Test
Team India
Bangladesh

More Telugu News